నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా పని చేసిన పి.శ్రీశైలం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా ప్రమోషన్ పొందారు. ఆయన పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యను కలిశారు. ప్రమోషన్ పొందిన శ్రీశైలంను కమిషనర్ అభినందించారు. విధుల్లో మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈ పదోన్నతి లభించినట్లు తెలిపారు.