ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారు. వైద్యులు సద్దాం రవీందర్ మాట్లాడుతూ.. మలేరియా పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మలేరియా వ్యాధిని అరికట్టాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.