MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోమవారం గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2014 నుండి 2024 వరకు నమోదైన అక్రమ కేసుల చిట్టా విప్పుదామని సవాల్ విసిరారు. గత పదేళ్లలో జూనియర్ కాలేజీ కోసం పోరాడిన వారిపై, పేరూరులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న సామాన్యులపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.