AP: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం చంద్రబాబు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోం మంత్రి అనిత స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.