వనపర్తి పీఏసీఎస్ పరిధిలోని చిమన గుంటపల్లి, అంకుర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే చిట్యాల, పెద్దగూడెం, కడుకుంట్ల ప్రాంతాల్లో కేంద్రాలు ప్రారంభమయ్యాయి. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పీఏసీఎస్ కార్యదర్శి గోపాల్ కోరారు.