HNK: నగరంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. కాజీపేటలోని ప్రధాన జంక్షన్లలో సిగ్నల్ పాయింట్ల వద్ద సోమవారం చలువ పరదాలను ఏర్పాటు చేశారు. సిగ్నల్ వద్ద వేచి ఉండే సమయంలో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన పోలీసులు గ్రీన్ పరదాలు ఏర్పాటు చేశారు .