BDK: యువతిపై దాడి చేసి గాయపరిచిన వ్యక్తికి భద్రాచలం కోర్టు శిక్ష ఖరారు చేసింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2025లో నమోదైన ఈ కేసులో భద్రాచలం పట్టణానికి చెందిన చింతలచెరువు మధు అనే వ్యక్తిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి శివ నాయక్ నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడికి 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు.