ధనియాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా ఉదయం పరగడుపున ధనియాల నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నీళ్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంతో పాటు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. ధనియాల నీళ్లు మెటబాలిజాన్ని పెంచుతాయి. బరువు నియంత్రణలో సహాయపడుతాయి.