TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో దారుణం జరిగింది. ఇద్దరు కుమారులకు ఉరి వేసి తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మార్కెట్ ఎదురుగా పొలంలో షావలి అనే వ్యక్తి ఉరి వేసుకున్నాడు. పెద్ద కుమారుడు విలాస్ 5 ఏళ్లు, చిన్న కుమారుడు వికేష్కు 3 ఏళ్లు ఉంటాయి. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.