ట్రావెల్ టెక్ కంపెనీ ఓయో మాతృ సంస్థ ప్రిజమ్ ప్రతిపాదించిన రూ.6,650 కోట్ల ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ పబ్లిక్ ఇష్యూ సుమారు 7-8 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో వచ్చే అవకాశం ఉంది. కంపెనీ డిసెంబర్ 2025లో కాన్ఫిడెన్షియల్ రూట్లో ముసాయిదా పత్రాలను సమర్పించగా, తాజాగా సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.