TG: రాష్ట్రంలో, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికారాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైసింగ్ 2047’ విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.