TG: తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, అప్పటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అందించిన సహకారాన్ని ప్రజలు ఎన్నటికీ మరువలేరని బీజేపీ నేత రాంచందర్ రావు అన్నారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో ‘వికసిత్ తెలంగాణ’ కోసం కృషి చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాలు ఆరోగ్యకరమైన పోటీతో ముందుకు సాగాలన్నారు.