సాయుధ పోరాటంతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళలను ముందుండి నడిపించిన ధీర వనిత సంగం లక్ష్మీబాయి. సామాజిక సేవకు పూర్తి సమయం వెచ్చించిన మానవతా మూర్తిగా.. బాలికలు, స్త్రీ సంరక్షణకు అలుపెరగక కృషి చేసి ఆత్మబంధువుగా ఆమె గుర్తింపు పొందారు. సాదాసీదా జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శంగా నిలిచిన SL లక్ష్మీబాయి AP రాష్ట్రం నుంచి లోక్సభకు ఎన్నికైన తొలి మహిళ కావడం విశేషం.