TG: CM రేవంత్ ఆసిఫాబాద్ సభలో తనకు అవమానం జరిగిందని ఎమ్మెల్యే కోవాలక్ష్మీ ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించకుండా అవమానించారని తెలిపారు. నియోజకవర్గ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాననే తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఆదివాసీ ఎమ్మెల్యేని అవమానించడం దారుణమని మండిపడ్డారు.