MHBD: గూడూరు మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సర్పంచ్ సునీత- కొమ్మాలు లబ్ధిదారు వాంకుడోత్ భద్రమ్మకు మంజూరైన ఇంటి పనులను మంగళవారం ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తింపజేస్తామని చెప్పారు.