KNR: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. రాములోరి దయతో గ్రామాభివృద్ధి జరుగుతుందని, దేవాలయాలు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని ఆయన అన్నారు.