SRD: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేడు మునిపల్లి మండలంలో పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బుదేరా శివారులోని సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో సాయంత్రం 5 గంటలకు మంత్రి పాల్గొంటారని పేర్కొంది. రాత్రి 7 గంటలకు తిరిగి సంగారెడ్డిలోని ఆయన నివాసానికి చేరుకుంటారని వెల్లడించింది.