KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ బంగారుపేట గ్రామంలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారికి పలు విశేష పూజలు జరిగాయి. అనంతరం వేద పండితులు నవగ్రహ చండీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్న సంతర్పణలో పాల్గొన్నారు.