SDPT: బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులి కృష్ణ ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు దామోదర్, ముక్కిస రత్నాకర్ పాల్గొన్నారు. సర్పంచ్ బిగుల్లా మోహన్, ఉపసర్పంచ్ వినీత్, రైతులు ఉన్నారు.