SKLM: ఈనెల 24 నుంచి జూన్ 11 వరకు జిల్లాలోని పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ సమయంలో శిక్షణలు, తరగతులు నిర్వహించ కూడదని తెలిపారు. నిబంధనలు అమలు చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు.