నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విజయవంతంగా పూర్తయిందని జిల్లా విద్యాధికారి (డీఈవో) ఏ.రమేష్ కుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు షెడ్యూల్ ప్రకారం సమాధాన పత్రాల పరిశీలనను సమయానికి పూర్తి చేసినట్లు వెల్లడించారు. మూల్యాంకనం లో పారదర్శకత, కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.