ATP: గుత్తి కోటలోని మెయిన్ పోస్ట్ ఆఫీస్లో రేపటి నుంచి ఆధార్ సేవలు పునః ప్రారంభం అవుతాయని పోస్ట్ ఆఫీస్ ఇంఛార్జ్ నందకుమార్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నంబర్ మార్పులు, పదేళ్లు దాటిన ఆధార్ కార్డులకు గుర్తింపు, చిరునామా పత్రాల అప్డేట్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.