అన్నమయ్య: పత్తివాండ్లపల్లెకు చెందిన ఒంటేరు సంతోష్‌పై రాయచోటికి చెందిన కొందరు యువకులు దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాకలిపల్లె సమీపంలోని మామిడి తోటలో నిద్రిస్తున్న సమయంలో గుంపుగా వచ్చిన యువకులు కట్టెలు, రాళ్లు, చేతులు, కాళ్లతో దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు శనివారం ఎస్సై హుషన్ తెలిపారు.