HNK: కాజీపేట రైల్వే డివిజన్ పరిధిలో మౌలిక సదుపాయాల విస్తరణకు దక్షిణ మధ్య రైల్వే ప్రాధాన్యం కల్పించింది. 2026-27 ప్రణాళికల్లో పలు కీలక రైల్వే పనులకు ఆమోదం లభించడంతో ప్రాంతీయ అభివృద్ధికి మార్గం సుగమమైంది. అదనపు రైల్వే లైన్లు, ట్రాక్ విస్తరణ, కొత్త మార్గాల సాధ్యాసాధ్యాలపై సర్వేలు చేపట్టేందుకు నిధులు కేటాయించారు.