AP: జూన్ 2 నుంచి 7 వరకు రష్యాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. SPIEF-2026 సదస్సుకు ఆయన ఆహ్వానం అందింది. ఈ మేరకు సెయింట్ పీటర్స్ బర్గ్ ఎకనామిక్ ఫోరంకు హాజరుకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ రష్యాలో పర్యటన సాగనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు.