నెల్లూరు నగరంలోని హోటళ్లపై కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి వంటగదులు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, ఎప్పుడైనా తనిఖీలు చేస్తామని నిర్వాహకులను హెచ్చరించారు. ఆహార నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, వంట గదులు అత్యంత శుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.