NRPT: కర్ణాటక నుంచి తెలంగాణలోకి అక్రమంగా ధాన్యం రాకుండా నారాయణపేట జిల్లా సరిహద్దుల్లో ఆరు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. జలాల్పూర్, కృష్ణ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్ అధికారులు నిఘా ఉంచుతారని పేర్కొన్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.