KNR: ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబందించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంటర్యూలు నిర్వహించారు. మండల స్థాయి ఎంపిక కమిటీ సభ్యులు ఎంపీడీవో వేణుగోపాల్ రావు, పశు వైద్యాధికారి శశికాంత్ రెడ్డి, ఎంఏవో మమత, సెర్ప్ ఏపీఎం సంపత్, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. మొత్తం 122 మంది దరఖాస్తు చేసుకోగా, 95 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు.