SRD: ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న సెన్సస్(జనగణన) శిక్షణ సమయాన్ని మార్చాలని PRTU నాయకులు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. శిక్షణను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే నిర్వహించాలని కోరారు. ఎండల వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.