ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై వాట్సప్ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేసినందుకు గాను ఒక గ్రూప్ అడ్మిన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రవికుమార్ అనే వ్యక్తి ‘ఏఎంసీ ప్రజా సమస్యల వేదిక’ అనే గ్రూపులో ఎమ్మెల్యేపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు రేకెత్తిస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.