KMM: ఆర్టీసీ నర్సంపేట బస్ డిపోలో పని చేస్తున్న డ్రైవర్ శంకర్ గౌడ్ అకాల మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారన్నారు.