E.G: తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో టూ మెన్ కమిటీ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెమరియల్ క్రికెట్ టోర్నమెంట్ను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు శుక్రవారం ప్రారంభించారు. క్రీడా కార్యక్రమాన్ని ప్రోత్సహించడం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.