JGL: ధర్మపురి మండలంలోని రాజారం గ్రామంలో గుర్రాల మమత- గంగాధర్‌కు చెందిన పూరి గుడిసె శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వెంటనే గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించగా చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పూరిగుడిసె దగ్ధం కాగా రూ. 1 లక్ష విలువైన వస్తువులు, భూమి పట్టాదారు పాసుపుస్తకాలు, రూ. 25 వేల నగదు కాలిపోయాయి.