విజయనగరం రీడ్స్ సంస్థ 100 వారాల పుస్తకాలు పఠన వేడుకలను ఆదివారం ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా IRS అధికారి డా.కె. కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిన్నారుల పఠన ప్రదర్శనలు, సాహిత్య కార్యక్రమాలు, అవార్డులు, సత్కారాలు, బుక్మార్క్ విడుదల, ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.