NZB: లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ సర్వసభ్య సమావేశం ఇవాళ నిజామాబాద్లో నిర్వహించారు. 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా పెట్టిగాడి రాఘవేందర్, కార్యదర్శిగా చింతల గంగాదాస్, కోశాధికారిగా అంకం రాజేందర్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా లయన్స్ జిల్లా అదనపు కోశాధికారి పి.లక్ష్మినారాయణ వ్యవహరించారు.