NLG: చిట్యాల పురపాలిక కేంద్రంలోని భువనగిరి రోడ్డులో సామాజిక సేవకుడు బొడ్డు బాబురావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ సర్పంచ్ జిట్ట నగేష్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు బాబురావు చేస్తున్న కృషిని అభినందించారు. గాదె ఎల్లేష్, బందెల రాములు, గోవర్ధన్, రమేష్, రాములు పాల్గొన్నారు.