NLR: సంగం మండలం గాంధీ జన సంఘం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో ఉన్న సుమారు 25 డ్రమ్ముల చికెన్ వ్యర్ధాలను కొండ సమీపంలో పోలీస్ సిబ్బంది పూడ్చిపెట్టారు. వాహనంపై కేసు నమోదు చేశారు. అక్రమంగా చికెన్ వ్యర్ధాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.