HYD: వాసవి మాత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవం సందర్బంగా మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఫతేనగర్ లోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని సత్కారించి తీర్థప్రసాదాలు అందచేశారు.