KNR: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు భద్రాద్రి కొత్తగూడెంలో ఈనెల 23-25 వరకు ఉత్సాహంగా జరిగాయి. చివరి రోజు నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక కాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన ఐదుగురికి అవకాశం లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వర్ణ వెంకటరెడ్డి, సభ్యులుగా మిల్కూరి వాసుదేవ రెడ్డి, కానవేని అరుణ, బాసిర సంపత్ రావు, చెల్పూరి రాములు ఎంపికయ్యారు.