ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరాన్ని జిల్లా ఎస్పీ నితిక పంత్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సమ్మెలో పాల్గొంటున్న కార్మికులతో ఆమె మాట్లాడారు. సమ్మెను శాంతియుతంగా కొనసాగించాలని, ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడకూడదని సూచించారు.