MHBD: మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ముస్మి గ్రామ పంచాయతీలో నూతన చలివేంద్రాన్ని సర్పంచ్ బానోత్ దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.