కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన మహిళా హోమ్ గార్డు జి.లక్ష్మీదేవికి శుక్రవారం హోమ్ గార్డులు అండగా నిలిచారు. జిల్లాలోని హోమ్ గార్డులంతా ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చి రూ.4,06,120లు సేకరించారు. ఈ మొత్తాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ చేతుల మీదుగా ఆమెకు చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హోమ్ గార్డుల ఐకమత్యాన్ని ఎస్పీ అభినందించారు.