JGL: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గల్ఫ్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేష్ రెడ్డి అన్నారు. భీమారం మండలంలోని ఒడ్యాడ్లో శుక్రవారం దార్ల లాస్య ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబానికి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ పాల్గొన్నారు.