అన్నమయ్య: రాయచోటి మండలం చెన్నముక్కపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో టీడీపీ యువనేత మౌర్యా రెడ్డి పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉర్దూ పాఠశాల ఏర్పాటు, నీటి సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.