MDK: తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో ఉపాధి హామీ పథకంలో పనులను ఎంపీడీవో సతీష్ పరిశీలించారు. సర్పంచ్ హరీష్ గౌడ్‌తో కలిసి గ్రామంలో చేపట్టిన డ్రైన్ అండ్ సోక్ పిట్, అంగన్వాడీ కేంద్రం, నర్సరీలను పరిశీలించారు. అంగన్వాడీలో నాణ్యమైన భోజనం అందజేయాలని సూచించారు. నర్సరీలలో ఉదయం సాయంత్రం వేళల్లో మొక్కలకు నీళ్లు పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.