KMM: వేంసూరు మండలం కొండగట్ల మల్లెల గ్రామంలో గురువారం ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారుమంచి రజిని ప్రసాద్ వీధివీధినా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు. నేడు ప్రభుత్వ బడుల్లో పదో తరగతి ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ సర్కారీ విద్యను ఆదరించాలని కోరారు.