ADB: జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ బాల కేంద్రంలో నిర్వహించే వేసవి ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులతో సంబంధిత కార్యక్రమ గోడ ప్రతులను శనివారం ఆవిష్కరించారు. ఈనెల 27వ తేదీ నుంచి మే 30 వరకు సాయంత్రం 4:30 నుంచి 7:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.