చార్ధామ్ యాత్రలో నిజమైన మాతృభక్తి వెలుగుచూసింది. ఈ రోజుల్లో చిన్నపాటి కష్టానికే వెనకడుగు వేసే వారెందరో ఉన్నారు. కానీ, ఈ ఇద్దరు సోదరులు మాత్రం తమ వృద్ధురాలైన అమ్మను డోలీలో భుజాలపై మోస్తూ కేదార్నాథ్కు తీసుకెళ్లారు. UP నుండి 1,800 కి.మీ., దాదాపు 4 నెలల పాటు కాలినడకన ప్రయాణించి ఈ క్లిష్టమైన యాత్ర పూర్తిచేశారు. వారు చేసిన ఈ సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.