KMM: క్షయ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కౌన్సిలర్ మహేష్ అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడులో టీవీ ముక్త్ భారత్ అభ్యాన్ కార్యక్రమం నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు వస్తున్నట్లయితే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తొలి దశలోనే క్షయ వ్యాధిని నివారించవచ్చని పేర్కొన్నారు.