MLG: జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు గాలికుంటు టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 1,30,200 పశువుల్లో 89,264కు టీకాలు పూర్తి చేసినట్లు డా.శ్రీకాంత్ తెలిపారు. పశువైద్య కేంద్రాల్లో ఉచితంగా మందులు, టీకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతులు ఈ సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.